NLG: జగిత్యాల సభలో కేసీఆర్ మాటల్లో విషయం లేదని ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శించారు. అలిశెట్టి ప్రభాకర్ వంటి కవుల పేర్లు వాడే నైతికత బీఆర్ఎస్కు లేదని, ఉద్యమకారులను అవమానించిన చరిత్ర కేసీఆర్‌దని మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ఇవాళ మాట్లాడారు. గొర్రెలు, లిక్కర్ స్కామ్‌ల వల్లే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారన్నారు.