SDPT: కోహెడ మండలం నారాయణపురంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ హాజరై కళాకారులను సన్మానించారు. రంగస్థలం మన సంస్కృతికి ప్రతిబింబమని తెలిపారు. కళాకారులు గుర్తింపు కార్డులకు దరఖాస్తు చేయాలని సూచించారు.