Bandi Sanjay: ప్రస్తుతం యువత ఎక్కువగా డ్రగ్స్, మద్యానికి బానిసలవుతున్నారు. చిన్నవయస్సులోనే అన్ని అలవాట్లు నేర్చుకుంటున్నారు. అయితే రాష్ట్రంలోని యువతను డ్రగ్స్, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.40 వేల కోట్లు ఆర్జిస్తోందన్నారు. పేరుకే విద్యాసంస్థలు. కానీ వాటి అడ్డాగా మత్తుపదార్థాల దందా జరుగుతోందని ఆరోపించారు. రామమందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని.. దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్కు తగదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షకోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పింది. కానీ ఇప్పుడు దీనిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? కేవలం మేడిగడ్డపైనే జ్యూడీషియల్ విచారణ అంటున్నారని బండి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా కాంగ్రెస్ తీరు ఉందని బండి సంజయ్ తెలిపారు.