BHPL: తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ నూతన భూపాలపల్లి కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిశారు. ఎమ్మెల్యే వారిని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్ ఉన్నారు.