NLG: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్ మండిపడ్డారు. శనివారం నల్గొండలో మాట్లాడుతూ.. 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ. 10 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.