HNK: మెయింటెనెన్స్ పనుల కారణంగా శనివారం హన్మకొండ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఎన్పీడీసీఎల్ టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కడిపికొండ, మచిలీ బజార్, హనుమకొండ చౌరస్తా సబ్స్టేషన్ల పరిధిలో కరెంటు నిలిపివేయనున్నారు. అలాగే ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సోమిడి ఉపకేంద్రం పరిధిలో విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పారు.