కరీంనగర్ జిల్లాలోని 11 తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,444 మంది దరఖాస్తు చేసుకోగా, 1,263 మంది పరీక్షకు హాజరయ్యారు. 181 మంది గైర్హాజరయ్యారు. కొత్తపల్లి మండలం ఎలగందుల పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి అశ్వని తానాజీ వాకడే తనిఖీ చేశారు.