సిద్దిపేట: బాలుడు తప్పిపోయిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపిన వివరాలు.. పట్టణంలోని లెక్చరర్ కాలనీలో ఉండే అల్లేపు లింగం కూమారుడు తేజ కుమార్ (11) ఈనెల 23న సాయంత్రం స్నేహితులతో ఆడుకుంటానని ఇంట్లో నుండి వెళ్ళాడు. ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.