WGL: పర్వతగిరి మండలం అన్నారంలోని పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థినులు రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన సింధు, జి. నందిని నెల్లికుదురులో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ అండర్–14 పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్ వరకు చేరుకున్నారు. ఈ విషయాన్ని పాఠశాల ఛైర్మన్ అశోక్ చారి ఇవాళ తెలిపారు.