NLG: పంచాయతి కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని CITU జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్ విజ్ఞప్తి చేశారు. చిట్యాలలో శనివారం గ్రామ పంచాయతీ కార్మికులు MPDO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పంచాయితీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.