BHNG: రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ దందాపై చర్యలు తీసుకోవాలని, BRS మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ డిమాండ్ చేశారు. సోమవారం చల్లూరు గుట్టల్లో 322 సర్వే నెంబర్లలో కొనసాగుతున్న మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక తాసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.