BHPL: చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో CCPL సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్ను మంగళవారం సాయంత్రం MLA గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.