PDPL: మంథని మండలంలోని ఆరెంద కాంప్లెక్స్ పరిధిలోని 13 పాఠశాలలను జిల్లా రిసోర్స్ పర్సన్ల (DRP) బృందం గురువారం సందర్శించింది. విద్యార్థుల అభ్యసన స్థాయిలను మెరుగుపరిచేందుకు తెలుగు, ఇంగ్లీష్, గణితం అంశాల్లో స్పాట్ అసెస్మెంట్ నిర్వహించారు. ఉపాధ్యాయుల బోధనా విధానం, మోడల్ రీడింగ్, గ్రంథాలయ వినియోగంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారు.