ADB: గ్రామాల్లో విగ్రహాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని మాజీ మంత్రి BRS జిల్లాధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. రూరల్ మండలంలోని కాచికంటిలో ఏర్పాటు చేసిన భారీ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో సోమవారం పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో ఐక్యత భావం పెంపొందుతుందని పేర్కొన్నారు.