ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో సిర్పూర్ (టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తిర్యాణిలో 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. దహెగాం, కౌటాల, కాగజ్ నగర్, ఆసిఫాబాద్లో 46.3 డిగ్రీలు నమోదయ్యాయి. రెబ్బెనలో 46.2, చింతలమానేపల్లి 46.0, వాంకిడి, కెరమెరిలో 45.8 డిగ్రీలుగా నమోదైంది. పెరుగుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.