MDCL: నూతనంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు అనంతరం వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చారు. కానీ.. జోనల్ కమిషనర్ అధికారుల పేర్లు తప్ప, వారి కాంట్రాక్టు వివరాలు, ఈమెయిల్ అడ్రస్ లాంటివి పొందుపరచలేదు. దీంతో కిందిస్థాయి అధికారులు సమస్యలను పరిష్కరించకుంటే, జోనల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే కాంటాక్ట్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని పలువురు డిమాండ్ చేశారు.