HYD: ప్రమోషన్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు HYDలో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మియాపూర్‌కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగిని “రోజుకు 5-10 నిమిషాల పని” అంటూ నమ్మబలికి రూ.91.03 లక్షలు కాజేశారు. మరో ఘటనలో దుండిగల్‌కు చెందిన గృహిణిని వాట్సాప్ ట్రేడింగ్ గ్రూప్ ద్వారా ఆకర్షించి రూ.1.09 కోట్ల మేర టోకరా వేశారు.