»Amit Shahs Speech At Gadwal Sakal Janula Vijaya Sankalpa Sabha
Amit Shah: బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైంది:అమిత్‌షా
గద్వాలలో సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి చిట్టా చాలా ఉందన్నారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్లను మింగేసిండని అమిత్ షా పేర్కొన్నారు.
Amit Shah's speech at Gadwal Sakal Janula Vijaya Sankalpa Sabha
Amit Shah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. గద్వాల జిల్లాలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభ(Sakal Janula Vijaya Sankalpa Sabha)లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పాల్గొని కేసీఆర్ పాలనను ఎండగట్టారు. జోగులంబ శక్తి పీఠానికి మోడీ ప్రభుత్వం రూ. 70 కోట్లు ఇచ్చిందని, కేసీఆర్ ఇస్తానన్నా రూ. 100 కోట్లు ఇవ్వలేదని, కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా అభివృద్ధికి ఉపయోగించలేదన్నారు. ఇక బీఆర్ఎస్ (BRS) పార్టీకి వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసమన్నమైందన్నారు. కేసీఆర్ అబద్ధపు మాటలతో ప్రజలను ఇంత కాలం మోసం చేశాడన్నారు. ఇచ్చిన హమీలు నెరవేర్చలేదని, గట్టు ఎత్తుపోతల పథకం, పాలమూరు రంగరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి అవలేదన్నారు. 300 పడకల ఆసుపత్రి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వలేదని తెలిపారు. ఇక చేతివృత్తుల పనుల వారిని పట్టించుకోలదని, చేనేత కార్మికుల కోసం పార్క్ ఏర్పాటు చేయలేదు అన్నారు. గద్వాల జిల్లాలో ఎక్కువగా ఉన్న బోయ కులస్తులకు కేసీఆర్ అన్యాయం చేశాడని షా పేర్కొన్నారు.
ఇక కేసీఆర్(KCR) దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పాడు, కాని బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని తెలిపారు. వెనుకబడిన తరగతుల వారికి టికెట్స్ ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలం అయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు బీసీ వ్యతిరేకులు అని, బీసీలకు న్యాయం చేయలంటే కేవలం బీజేపీ పార్టీతోనే జరుగుతుందని తెలిపారు. తెలంగాణ యువకులు, నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆడుకున్నారని, పేపర్ లీకులతో వారి ఆశలపై నీళ్లు చల్లాడన్నారు. బీజేపీని గెలిపిస్తే ఒక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఓవైసీకి లొంగిన కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అధికారికంగా ఆ వేడుక నిర్వహిస్తమని గద్వాల సభలో అమిత్‌షా పేర్కొన్నారు.