AP: అమరావతి నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ మరో రూ. 32,500 కోట్లు రుణం తీసుకోనుంది. ప్రపంచ బ్యాంకు-ఆసియా అభివృద్ధి బ్యాంకుల కన్సార్షియంతో పాటు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్ నుంచి రుణం సమీకరించనుంది. ఇప్పటికే రుణానికి సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. రుణం మంజూరుకు ఆ సంస్థలు అంగీకారం తెలిపాయి.