RR: చేవెళ్లలోని మీర్జాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచి వేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వరుసగా జరుగుతున్న రహదారి ప్రమాదాలకు ప్రభుత్వ రవాణా వ్యవస్థ నిర్లక్ష్యమే కారణమని, రద్దీగా ఉండే రహదారి విస్తరణ చేపట్టక ప్రభుత్వాలు తమకు పట్టనట్లుగా వ్యవహరించడం శోచనీయమన్నారు.