55వ కేరళ స్టేట్ ఫిల్మ్ జాతీయ అవార్డులను ప్రకటించిన సందర్భంగా ఆ అవార్డుల కమిటీ ఛైర్మన్ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘జాతీయ సినీ అవార్డుల విషయంలో జ్యూరీ సభ్యులు రాజీ పడుతున్నారని ధైర్యంగా చెబుతున్నా. కమిటీ సభ్యులు అవార్డుల ఎంపిక విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. అయితే, మమ్ముట్టి లాంటి గొప్ప వ్యక్తులకు ఇలాంటి అవార్డులు అవసరం లేదు’ అని అన్నారు.