SRD: సంగారెడ్డి మండలం కలబ్ గూర్ పరిధిలో ప్రజా బాట కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి విద్యుత్ సమస్యను అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. డిఈ లక్ష్మణ్ మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.