sajjanar:‘అందరికీ ఈమెలా అదృష్టం వరించదు!’ సజ్జనార్ సందేశం
sajjanar:టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (sajjanar) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆర్టీసీకి సంబంధించిన సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చేస్తారు. ఆర్టీసీకి లింక్ ఉన్న ప్రతీ విషయాన్ని ఆయన షేర్ చేసుకుంటారు. తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఓ యువతి (women)) రెప్పపాటులో ప్రాణాలతో బయటపడుతుంది.
sajjanar:టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (sajjanar) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆర్టీసీకి సంబంధించిన సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చేస్తారు. ఆర్టీసీకి లింక్ ఉన్న ప్రతీ విషయాన్ని ఆయన షేర్ చేసుకుంటారు. తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఓ యువతి (women) రెప్పపాటులో ప్రాణాలతో బయటపడుతుంది. ‘అందరికీ ఈమెలా అదృష్టం వరించదు!’ అని టైటిల్ పెట్టి ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. 14 సెకన్ల (14 seconds) నిడివి గల వీడియోలో ఓ యువతి బైక్‌తో వస్తోంది. ముందు కారు ఉండగా.. వెనకాల లారీ ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కావచ్చు కారు కదులుతుంది. ఆ వెంటనే ఆమె బైక్ (byke) మూవ్ చేస్తోంది. కానీ అనుకున్నంత కదలదు. వెంటనే లారీ డ్రైవర్ పోనిస్తాడు. దాంతో బైక్ కింద పడిపోతుంది. ఆమె కూడా కిందనే ఉంటారు. లారీ వెళ్లిన తర్వాత.. పక్కన గల మరో కారు వెనకాలకు వెళ్లి ఉంటుంది. ఓయ్ అని లారీ డ్రైవర్‌పై ఆమె అరుస్తోంది.
అందరికీ ఈమెలా అదృష్టం వరించదు!
ద్విచక్రవాహనదారులారా..! లేన్ డ్రైవింగ్ ను పాటించండి. రోడ్డుపై బైక్ తో అడ్డదిడ్డంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. #RoadSafetypic.twitter.com/uq9gRIwubk
ఆ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. నిజమే.. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇదే విషయాన్ని సజ్జనార్ (sajjanar) చెప్పారు. లేన్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని కోరుతున్నారు. లేన్ తప్పితే పరిస్థితి ఇలానే ఉంటుందని చెబుతున్నారు. రోడ్డు మీద వెళ్లే సమయంలో చక్కగా వెళ్లాలని.. అడ్డదిడ్డంగా వెళ్లొద్దని సూచించారు. అలా వెళితే ఇదే జరుగుతుందని చెబుతున్నారు. ఆ వీడియో (video) సోషల్ మీడియాలో (social media) వైరల్ అవుతుంది. ఆ వీడియో ఇప్పటికే 12.6 కే వ్యూస్ వచ్చాయి. చాలా మంది లైక్ చేశారు. కామెంట్ చేశారు. ఆమెకు భూమి మీద నూకలు ఉన్నాయని అంటున్నారు.