BDK: ఇల్లందు మున్సిపాలిటీ 18వ వార్డులో మంగళవారం మున్సిపల్ సిబ్బంది స్థానిక ప్రజలకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అధికారులు మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిప్ సిబ్బందికి అందించాలని కోరారు.