KMM: బీరోలు గ్రామానికి చెందిన బద్దిపూడి రాములు, రాణి దంపతుల కుమారుడు వెంకటేష్ (21) చెరువులో పడి మృతి చెందినట్లు శనివారం స్థానికులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం గ్రామంలో ఈ ఘటన జరిగిందని అన్నారు. సమాచారం అందుకున్న మోతె పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.