NLG: త్రిపురారం మండలం దుగ్గేపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఛైర్మన్ అంకతీ సత్యం ప్రారంభించారు. వర్షాల నేపథ్యంలో రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఐకేపీ ఏర్పాటుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.