NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల వివరాలను ఎన్హెచ్ఐఎస్, పోషణ ట్రాకర్ యాప్‌లలో ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. డిజిటల్ పద్ధతిలో డేటాను పొందుపరుస్తూ పారదర్శక సేవలు అందించాలని టీచర్లకు సూచించారు.