MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో జన గణన హౌస్ మ్యాపింగ్ సర్వే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2027 జనగణన సర్వే కార్యక్రమంలో భాగంగా మొదటి విడత మున్సిపాలిటీ పరిధిలోని ఇళ్లకు గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 వార్డుల్లో ప్రతి ఇంటికి ఒక నంబర్ కేటాయిస్తూ మ్యాపింగ్ సర్వేను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.