GDWL: అలంపూర్ మండలం క్యాతూరు గ్రామంలోని పప్పు శనగ కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి నాగర్జున రెడ్డి బుధవారం పరిశీలించారు. క్వింటాల్ శనగకు ప్రభుత్వం రూ.5,875 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి, తేమ శాతం 14 లోపు ఉంచాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.