కాకినాడ భానుగుడి కూడలిలోని సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఈ నెల 9న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ జంగం బాజ్జీ తెలిపారు. టీవీఎస్ మోటార్స్, టాటా ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ట్రెండ్స్, కందుకూరి సిల్క్స్లో వివిధ పోస్టులకు ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు.