WNP: శ్రీరామనవమి దేశానికి ఐక్యతను, ధర్మబలాన్ని అందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు. వనపర్తిలోని పలు ఆలయాల్లో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన ఆయన, ప్రతి పౌరుడు సుఖసంతోషాలతో ఉండాలని రాముడిని ప్రార్థించారు.