ADB: తపాలా శాఖలో రూ. 2,12,033 నిధులను దుర్వినియోగం చేసినట్లు రూరల్ సీఐ ఫణిదర్ శనివారం తెలిపారు. ఈ మేరకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అబ్దుల్ నిజాం అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. చీట్ చేసిన సొమ్మును తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని CI ఫణిదర్ పేర్కొన్నారు.