MDK: రామాయంపేటలోని పెద్ద మసీదులో ముస్లింలు కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజుల ఆధ్వర్యంలో ఈ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గంగా జమున తహజీబ్‌కు ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని తెలిపారు.