KNR: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శీతాకాలం శిబిరం నిన్న ముగిసింది. హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారిచే నిర్వహించబడుతున్న జాతీయ సేవా పథకం ఏడు రోజుల శీతాకాల శిబిరం నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి, గ్రామ సర్పంచ్ జంగ శిరీష పాల్గొని మాట్లాడారు.