JGL: కోరుట్ల పట్టణంలో వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ సురేష్ బాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మట్లాడుతూ.. గత కొంతకాలంగా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లు చేస్తున్న నాగరాజు అను రౌడీ షీటర్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.