NGKL: నల్లమల అటవీ ప్రాంతంలో గ్రే హార్న్ బిల్ పక్షుల సందడి పెరిగింది. ప్రత్యేకమైన వంకర ముక్కుతో, గట్టిగా వినిపించే కేకలతో ఇవి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. పండ్లు, చిన్న పురుగులను ఆహారంగా తీసుకునే ఈ పక్షులు అడవుల్లో విత్తనాల వ్యాప్తికి సహాయపడుతున్నాయి. చెట్టు గుహల్లో గూడు కట్టే విధానం ప్రత్యేకతగా నిలుస్తుంది. అటవీ సమతుల్యతకు ఇవి కీలకమని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.