BHPL: జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎండ దంచి కొడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు సైతం ఎండ వేడి తగలకుండా తలకు కర్చీఫ్, టవల్, స్కార్ఫ్లు కట్టుకొని వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై వాహనాలు తిరగడం లేదు. ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.