NLG: ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరులు పొన్నాల సురేంద్ర, దామోదర్, మహేష్, భారతిల చిత్రపటాలకు చిట్యాలలో ఎమ్మార్పీఎస్ నేతలు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేస్తున్నాయని, ఇప్పటికైనా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని ఎరసాని గోపాల్, మేడి శంకర్ డిమాండ్ చేశారు.