ASF: కాగజ్నగర్ మండలంలోని జోంబుగ గ్రామ వంతెనను జిల్లా కలెక్టర్ కే. హరిత సందర్శించారు. వంతెన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆమె, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని ఇతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.