TG: శాసనసభ, మండలిలో రెండో రోజు బడ్జెట్‌పై సాధారణ చర్చ కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఉభయసభలు మొదలుకానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభలో పలు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చకు ఉభయసభల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానమివ్వనున్నారు.