NRPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో గ్రాడ్యుయేట్, నిరుద్యోగులకు సరైన కేటాయింపులు చేయకుండా అన్యాయం చేసిందని తెలంగాణ గ్రాడ్యుయేట్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ విమర్శించారు. సోమవారం నారాయణపేటలో విలేకరులతో మాట్లాడారు. గ్రాడ్యుయేట్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.