KRNL: ఆదోని పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే రాంజల చెరువు చెత్త చెదారంతో కలుషితమవుతోంది. ఇదే నీటిని తాగునీటిగా వినియోగిస్తున్న ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరిక బోర్డులు ఉన్నా అమలులో లేకపోవడం గమనార్హం. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.