KMM: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తుందని మధిర మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు తెలిపారు. ఎర్రుపాలెం మండలంలోని భీమవరం, మామునూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు బుధవారం ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాలనే ఆశ్రయించాలని సూచించారు.