VKB: రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం నవాంధీ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. ప్లాట్‌ఫారమ్ విస్తరణ, ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కువ కోచ్‌లను ఉన్న రైళ్లు ఆగినప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా ప్లాట్‌ఫారమ్ పొడవు పెంచుతున్నారు. ప్లాట్‌ఫారమ్‌పై సిమెంట్స్ పనులతో పాటు షెడ్లు, బెంచీలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.