ADB: పట్టణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేసే మెడికల్ కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని AITUC యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవేందర్ అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాదులో నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమానికి బయలుదేరినట్లు తెలిపారు. సకాలంలో వేతనాల చెల్లింపు, పలు సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.