MHBD: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని DSFI జాతీయధ్యక్షుడు డా. వివేక్ హెచ్చరించారు. ఎంపీ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని, లేదంటే తెలంగాణ ప్రజల నుండి తిరుబాటు తప్పదన్నారు. పార్లమెంట్లో తెలంగాణకి చెందిన 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ.. తెలంగాణను కించపరుస్తుంటే స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.