SRPT: హుజూర్ నగర్ స్థానిక 14వ వార్డు ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కౌన్సిలర్ దగ్గుపాటి కవితా బాబురావు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీను, కమిషనర్ శ్రీనివాస్, ఎస్సై మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలని పిలుపునిచ్చారు.