GDWL: ధరూరు మండలం జాంపల్లి శివారులో శుక్రవారం పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్సై నందికర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో రూ.37 వేల నగదు, 2 బైకులు, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మిగతా వారు పరారీలో ఉన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.