BHNG: మోత్కూరు మండలంలోని దత్తప్ప గూడెం గ్రామానికి చెందిన ఓర్సు సురేష్ విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ లైన్ మెన్‌గా విధులు నిర్వహిస్తూ 2025 అక్టోబర్‌లో విధి నిర్వహణలో మరణించాడు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారాన్ని సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు.