MLG: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొమ్మనబోయిన వెంకన్న తెలిపారు. మంగళవారం టీపీసీసీ జిల్లా కమిటీ నుండి తొర్రూరు పట్టణానికి చెందిన వెంకన్నను జిల్లా కార్యదర్శిగా నియమించారు. నమ్మకంతో కార్యదర్శిగా నన్ను నియమించినందుకు పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.